సీఎం ప‌ర్య‌ట‌న‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌పై అధికారుల‌తో మంత్రులు స‌మీక్ష‌

తిరుప‌తి: ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈనెల 5వ తేదీన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తిరుప‌తిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు మంత్రులు నారాయ‌ణ‌స్వామి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి జిల్లా అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. తిరుప‌తి జిల్లా స‌చివాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రమ‌ణారెడ్డితో పాటు అధికార యంత్రాంగం, ముఖ్య‌మంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేట‌ర్‌, ఎమ్మెల్సీ త‌ల‌శీల రాఘురాం, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ఆదిమూలం, ఎమ్మెల్సీ భ‌ర‌త్ హాజ‌ర‌య్యారు. సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. 

Back to Top