`అమ్మ డెయిరీ`ని ప్రారంభించిన మంత్రులు పెద్దిరెడ్డి, ఉషాశ్రీ‌చ‌ర‌ణ్‌

అనంతపురం: అనంతపురం రూరల్ మండలం ఆలమూర్‌లో తోపుదుర్తి మహిళా సహకార డెయిరీ సారథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ డెయిరీని రాష్ట్ర విద్యుత్‌, అట‌వీ, భూగ‌ర్భ గ‌నుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. మహిళా పాడి రైతుల ఆర్ధికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో 10 వేల మంది మహిళల యాజమాన్యంతో రూ. 20 కోట్ల  సొంత నిధులను వెచ్చించి అమ్మ డెయిరీని   వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏర్పాటు చేశారు. డెయిరీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అమ్మ డెయిరీ లోగోను మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ గోరంట్ల‌ మాధవ్, ఎమ్మెల్సీలు వాల్మీకీ మంగమ్మ, శివరామ రెడ్డి, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Back to Top