చంద్ర‌బాబుకు ఇప్పుడు కూడా మంచి బుద్ధి రావ‌డం లేదు 

మంత్రులు నారాయ‌ణ‌స్వామి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
 

చిత్తూరు:  టీ డీపీని ప్ర‌జ‌లు చిత్తుచిత్తుగా ఓడించినా కూడా చంద్ర‌బాబుకు మంచి బుద్ధి రావ‌డం లేద‌ని మంత్రులు నారాయ‌ణ‌స్వామి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. గురువారం మంత్రులు చిత్తూరులో 108, 104 వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ప్ర‌జారోగ్యంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ది దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోయే నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని వివిధ రాష్ట్రాలు, జాతీయ మీడియా ప్ర‌శంసిస్తున్నాయ‌ని చెప్పారు. కానీ చంద్ర‌బాబుకు, ఎల్లో మీడియాకు ఇది న‌చ్చ‌డం లేద‌ని విమ‌ర్శించారు. 104, 108 వాహ‌నాల‌ను ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ఇవ్వ‌డం దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోయింద‌న్నారు. చంద్ర‌బాబు ఎన్ని అబ‌ద్దాలు చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. పేద‌ల ప‌క్షాన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిల‌వ‌డాన్ని చంద్ర‌బాబు త‌ట్టుకోలేక‌పోతున్నార‌న్నారు. 

Back to Top