రొయ్య‌ల ధ‌ర‌లు ప‌డిపోకుండా చ‌ర్య‌లు

రొయ్య‌ల ఎగుమ‌తి ధ‌ర‌ల‌పై మంత్రులు క‌న్న‌బాబు, సీదిరి అప్ప‌ల‌రాజు స‌మీక్ష‌

అమ‌రావ‌తి: రొయ్య‌ల ధ‌ర‌లు ప‌డిపోకుండా అవ‌సర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. రొయ్య‌ల ఎగుమ‌తి ధ‌ర‌ల‌పై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, ప‌శుసంవ‌ర్థ‌క‌, మ‌త్స్య శాఖ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి క‌న్న‌బాబు మాట్లాడుతూ.. రొయ్య‌ల ఎగుమ‌తి ధ‌ర‌లు త‌గ్గిపోతాయ‌ని రైతులు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదన్నారు. రైతుల‌కు మేలు చేసేందుకు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారని చెప్పారు. రొయ్య‌ల ధ‌ర‌లు ప‌డిపోకుండా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌న్నారు.

Back to Top