సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన  40 రోజుల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. మొట్టమొదటి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇప్పటికే చారిత్రాత్మక బిల్లులకు సభ ఆమోదం తెలుపగా శుక్రవారం మరో మూడు బిల్లులను సభ ముందుకు తెచ్చారు. లోకాయుక్త సవరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. జ్యూడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు దిశగా ఇండస్ట్రీయల్‌ మౌలిక వసతుల సవరణ బిల్లును మంత్రి గౌతంరెడ్డి ప్రవేశపెట్టారు. మార్కెట్‌ కమిటీల సవరణ బిల్లును మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టారు. వీటిపై సభ్యులు చర్చిస్తున్నారు.
 

Back to Top