బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం ఆదేశం

మంత్రులు గుమ్మనూరు, ధర్మాన
 

విశాఖ: ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రులు గుమ్మనూరు జయరాం, ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను గ్రామాల్లోకి అనుమతించడం లేదన్నారు. కాసేపట్ల్లో ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తుందన్నారు.ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసరాల్లో సాధారణ పరిస్థితి ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.వదంతులు నమ్మొద్దని, పరిస్థితి అదుపులో ఉందని మంత్రులు పేర్కొన్నారు.బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేశామన్నారు. సుమారు 15 వేల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

Back to Top