తుంగభద్ర పుష్కరాల‌ ఏర్పాట్లు పూర్తి

పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు బుగ్గన, జయరాం

రేపు మధ్యాహ్నం సంకల్‌భాగ్‌ పుష్కరఘాట్‌కు సీఎం వైయస్‌ జగన్‌

కర్నూలు: రేపు మధ్యాహ్నం 1:21 గంటలకు తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. కర్నూలు జిల్లా సంకల్‌భాగ్‌ పుష్కరఘాట్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం వైయస్ జగన్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా సీఎం వైయస్‌ జగన్‌ కర్నూలు రానున్నారు. సంకల్‌భాగ్‌ పుష్కరఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. 

పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని మంత్రులు బుగ్గన, జయరాం మండిపడ్డారు. మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేకుండా తుంగభద్ర పుష్కర ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రేప‌టి నుంచి డిసెంబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కు పుష్క‌రాలు కొన‌సాగుతాయ‌ని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top