‘చదవడం మాకిష్టం’ అద్భుత కార్యక్రమం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోంమంత్రి సుచరిత

విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టారని, ఆ దిశగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ‘చదవడం మాకిష్టం’ పేరుతో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థుల్లో చదివే అభిరుచిని అలవాటు చేయడం.. చదువులోని ఆనందాన్ని పరిచయం చేసే విధంగా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతి స్కూల్‌లో గ్రంథాలయాలు ఏర్పాటు ద్వారా వి లవ్‌ రీడింగ్‌ కార్యక్రమం. విద్యార్థులలో పుస్తక పఠనం ద్వారా మనోవికాసం పెంచడం.. జ్ఞానాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తోంది. 

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. చదవడం మా కిష్టం అద్భుత కార్యక్రమం అని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. ఇంగ్లిష్‌ మీడియంతో విద్యార్థుల భవిష్యత్‌ బాగుంటుందని సీఎం ఆలోచించారన్నారు. చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకెళ్తామన్నారు. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లడుతూ.. విద్యకు పునాది చాలా ముఖ్యమన్నారు. విద్యార్థులు పుస్తకాలను చదవి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. 

 

తాజా వీడియోలు

Back to Top