మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్సవ ఏర్పాట్లు ప‌రిశీల‌న‌

అమ‌రావ‌తి: రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా  ఏప్రిల్‌ 11వ తేదీన మంత్రుల ప్రమాణస్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. గతంలో మంత్రులు ప్రమాణం చేసిన చోటే మళ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు  చేస్తున్నారు. సచివాలయం పక్కన ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌ తలశిల రఘురాం, పొలిటికల్‌ సెక్రటరీ ముత్యాలరాజు పరిశీలించారు.

Back to Top