గత ప్రభుత్వం స్కాంల కోసమే స్కీంలు పెట్టింది.. 

ఎస్సీ కార్పొరేషన్‌లో రూ.700 కోట్ల అవినీతి 

ఎస్పీ కార్పొరేషన్‌ అవకతవకాలపై విచారణ

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌

అమరావతిః ఎస్సీ కార్పొరేషన్‌లో గతంలో జరిగిన అవకతవకాలపై విచారణకు ఆదేశించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ లోన్లలో అవినీతి జరుగుతుందన్నారు. అర్హులకు సబ్సిడీ లోన్లు అందని పరిస్థితి ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌లో గతంలో రూ.700 కోట్లపై అవినీతి జరిగిందన్నారు. కాపు,ఎస్సీ,ఎస్టీ,బీసీ లోన్లు లబ్ధిదారులకు చేరలేదు. గత ప్రభుత్వం స్కాంల కోసమే స్కీంలు పెట్టారన్నారు. సక్రమంగా ఉన్న పథకాలకే బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా యూనిట్ల స్థాపనకు రూ.10 లక్షల వరుకు లోన్లు ఇస్తామన్నారు. సబ్సిడీ రూ.లక్ష మాత్రమే ఇస్తామని తెలిపారు.

 

తాజా ఫోటోలు

Back to Top