మంత్రి విశ్వ‌రూప్ ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ స‌క్సెస్‌

అమ‌రావ‌తి: రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆస్పత్రిలో నిర్వహించిన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆయనకు గుండెలో ఆరు చోట్ల వాల్వులు బ్లాక్‌ అయ్యాయి. దీంతో వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. సోమ‌వారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ శస్త్రచికిత్స జరిగిందని మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి తెలిపారు. శస్త్ర చికిత్స‌కు ముందే మంత్రి విశ్వ‌రూప్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌లో మాట్లాడారు. శస్త్రచికిత్స విజయవంతం అవుతుందని ఆయనకు ధైర్యం చెప్పారు. మంత్రి సతీమణి బేబీమీనాక్షి, కుమారుడు కృష్ణారెడ్డిలతో కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన విష‌యం తెలిసిందే. 

Back to Top