ముఖ్యమంత్రి చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తాం

26న శ్రీకాకుళంలో సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర ప్రారంభం

పల్నాడు బహిరంగ సభను విజయవంతం చేద్దాం

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట: వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచిని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేసేందుకు సామాజిక న్యాయభేరి పేరుతో బస్సుయాత్ర చేపడుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. చిలకలూరిపేటలో సామాజిక న్యాయభేరికి సంబంధించి ముఖ్యనేతలS సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఈనెల 26వ తేదీన శ్రీకాకుళం నుంచి సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారని, జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కృషిచేయాలన్నారు. 

బీసీ మహిళ అయిన తనకు కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దని మంత్రి విడదల రజిని గుర్తుచేశారు. కేబినెట్‌ కూర్పులో 77 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారన్నారు. లోకల్‌ బాడీ, నామినేటెడ్‌ పదవులు తీసుకున్నా.. 50 శాతానికి పైగా అవకాశాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కుతున్నాయని, ఇంతటి సామాజిక న్యాయం మరెక్కడా లేదని, కేవలం ఏపీలోనే సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు. తరాలుగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేస్తున్న మంచిని రాష్ట్ర వ్యాప్తంగా వివరిస్తామని చెప్పారు. 
 

Back to Top