వైయ‌స్‌ జగన్‌ అంటే ఒక సంకల్పం

పార్టీ విస్తృత స్థాయి సమా­వేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే ఒక సంక‌ల్ప‌మ‌ని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమ­వారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సి­పల్‌ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమా­వేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మె­ల్సీ­లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌­చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక సంక్షేమ‌ పథకాలతో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించార‌న్నారు. బడుగు, బలహీన వర్గాలకు కేబినెట్‌లో స్థానం కల్పించార‌ని తెలిపారు. పేదరికాన్ని రూపుమాపడమే సీఎం వైయ‌స్ జగన్‌ లక్ష్యమ‌ని తెలిపారు.

 రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోంది: మంత్రి మేరుగ నాగార్జున
రాష్ట్రంలో సంక్షేమ పాల‌న న‌డుస్తోంద‌ని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో బడుగు, బలహీన వర్గాలకు మనోధైర్యం పెరిగిందన్నారు. పేదలకు కార్పోరేట్‌ వైద్యం అందిస్తున్న ఘనత సీఎం వైయ‌స్ జగన్‌కే ద‌క్కుతుంద‌ని చెప్పారు.

మైనారిటీలకు రిజర్వేషన్‌ కల్పించిన ఘనత వైయ‌స్ఆర్‌ది: హఫీజ్‌ఖాన్‌
ముస్లిం మైనారిటీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిదే అని క‌ర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ గుర్తు చేశారు. ప్రతి రంగంలోనూ ఏపీ దూసుకుపోతోంద‌ని చెప్పారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పేదల పిల్లలకు ఉన్నత చదువులు అందిస్తున్నార‌ని తెలిపారు. మేనిఫెస్టోలో ప్రతీ హామీని అమలు చేసిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే అన్నారు. మ‌ళ్లీ 2024లో జ‌గ‌న‌న్న‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని హాఫీజ్ ఖాన్ అన్నారు. 

Back to Top