బలహీనవర్గాలకు అసలైన సంక్రాంతి పండుగ 

బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

విజయవాడ: బలహీనవర్గాల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలకు అసలైన సంక్రాంతి పండుగ అని చెప్పారు. బీసీల అభ్యున్న‌తికి సీఎం బంగారు బాట వేశార‌న్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ సంక్రాంతి సభకు మంత్రి వేణుగోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  56 బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దేనన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చారన్నారు. బీసీలను ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి సీఎం పెద్దపీట వేశారన్నారు. గత పాలకులు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top