సీఎం వైయస్‌ జగన్‌ బీసీల పక్షపాతి

త్వరలో సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఐదు కార్పొరేషన్లు 

బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీనవర్గాల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సంచార జాతుల విముక్తి దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. సంచార జాతులను గత ప్రభుత్వాలు విస్మరించాయని ధ్వజమెత్తారు. సంచార జాతుల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఐదు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top