కులాల వారీగా బీసీ జనగణన

అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌

అసెంబ్లీ: కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్ అని.. 1931లో జనగణన ఆధారంగానే బీసీలను ఇప్పటికీ లెక్కిస్తున్నారన్నారు. వెనకబడిన కులాల జనగణన అత్యవసరం అని.. నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని మంత్రి చెప్పారు. 90 ఏళ్లుగా బీసీల లెక్కలు దేశంలో లేవని, బీసీల జీవన స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బీసీల్లో 139 కులాలు ఉన్నాయ‌ని, కుల గణన కచ్చితంగా జరగాల‌ని చెప్పారు. 

ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వరంగా మారిందని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామ‌ని వివ‌రించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బీసీలకు మేలు జ‌రుగుతంద‌ని చెప్పారు. బీసీలను చైతన్యం దిశగా సీఎం వైయ‌స్‌ జగన్‌ నడిస్తున్నారన్నారు. ఇది బీసీల ప్రభుత్వమ‌ని, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 50 శాతం, కాంట్రాక్టు పనుల్లో బీసీలకు 50 శాతం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కేటాయిస్తున్నార‌న్నారు. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించింద‌ని చెప్పారు. వైయ‌స్ఆర్ చేయూత గొప్ప పథకమ‌ని, బీసీల కోసం మ‌హానేత వైయ‌స్ఆర్ రెండడుగులు ముందుకు  వేస్తే.. సీఎం వైయ‌స్‌ జగన్‌ పదడుగులు వేస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top