20 లక్షల మంది మహిళలకు  ‘జగనన్న చేయూత’  

బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ 
 

 గోదావరి:రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ‘జగనన్న చేయూత’ ప‌థ‌కం వ‌ర్తింప‌జేస్తున్న‌ట్లు మంత్రి వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. ఈ ప‌థ‌కానికి  ఈ ఏడాది రూ. 4,7 00 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.  రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రేపు(బుధవారం) ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు  మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నేరుగా ఏడాదికి 18,750 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. అంటే నాలుగేళ్ళలో 75 వేల రూపాయలు వారికి ఆర్థిక సహయం అందనుందన్నారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా..  సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని, చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణకు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అవలంభిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top