ఫ్లాప్‌ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్‌

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

విజయవాడ: ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లానాయక్ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌ అయ్యిందని.. సినిమా ఫెయిల్యూర్‌ను ప్రభుత్వంపై రుద్దేందుకే చంద్రబాబు, పవన్ డ్రామాలాడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. విజ‌య‌వాడ‌లో మంత్రి వెల్లంప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ.. అఖండ, బంగార్రాజు సినిమాల‌ టైంలో ఉన్న జీవోనే ఇప్పటికీ అమల్లో ఉందన్నారు. కొత్త‌గా ఎలాంటి ష‌ర‌తులు పెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫ్లాప్‌ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

Back to Top