థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేశాకే ఆలయాల్లోకి అనుమతి

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేశాకే భక్తులను దేవాలయాల్లోకి అనుమతిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాల్లోకి భక్తులను అనుమతించే అంశంపై కసరత్తు చేస్తున్నామని, ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. స్క్రీనింగ్‌ టెస్టుల అనంతరం భక్తులను దేవాలయాల్లోకి అనుమతిస్తామన్నారు. దేవుడి దర్శనం కోసం ఆలయాలకు వచ్చే భక్తులు శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారు. మొక్కులు తీర్చుకోవడానికి మాత్రమే దేవాలయాలకు భక్తులు రావాలని, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయాల్లో తీసుకున్న జాగ్రత్తలను ఇప్పటికే హెల్త్‌ డిపార్టుమెంట్‌కు అందజేశామన్నారు. 
 

Back to Top