ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజుపై మంత్రి వెల్లంప‌ల్లి ఫైర్‌

తిరుపతి: ‌తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆశీస్సులు సీఎం వైయ‌స్‌ జగన్‌, రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నానని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ స‌మేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా దృష్ట్యా‍ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలు ఇంటికే పరిమితం కావాలని సూచించాయన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. వైయ‌స్ఆర్  కుటుంబాన్ని ఏ ఒక్క కులానికో, మతానికో అంటకడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో కూర్చొని.. చంద్ర‌బాబు హైదరాబాద్‌లో కూర్చొని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర‌య్యారు. విగ్రహాలు వీధుల్లో పెట్టరాదనే నిర్ణయానికి ముందు అన్ని పార్టీలు, మఠాధిపతులు, పీఠాధిపతులతో మాట్లాడామన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రఘురామ కృష్ణంరాజు ప‌నిచేస్తున్నార‌న్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top