పవన్‌ను పొలిటీషియన్‌ అని ఎవరూ అనుకోవడం లేదు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ను పొలిటీషియన్‌ అని ఎవరూ అనుకోవడం లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. పవన్‌కళ్యాణ్‌ ఈ రాష్ట్రానికి గెస్ట్‌ ఆర్టిస్టు అని ఎద్దేవా చేశారు. నెల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని వేరే రాష్ట్రం వెళ్లిపోయాడని, మళ్లీ ఇప్పుడు వచ్చి రైతు భరోసా యాత్ర అంటున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమం పేరును కూడా మా పార్టీ నుంచి కాపీ కొట్టాడని పేర్కొన్నారు. చంద్రబాబుకు పవన్‌ దత్తపుత్రుడని అందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే రైతు యాత్రలు చేస్తానంటున్నారని తెలిపారు. ఏం ముఖం పెట్టుకుని రైతుల వద్దకు పవన్‌ కళ్యాణ్‌ వెళ్తాడని నిలదీశారు. రైతుల కోసం పని చేసే ప్రభుత్వం మాదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్నాడని, అలాంటప్పుడు ఇంకా బీజేపీతో ఎందుకు ప్రయాణం చేస్తున్నాడో చెప్పాలని పట్టుబట్టారు. పవన్‌ వెంటనే బీజేపీ నుంచి బయటకు రావాలని హితవు పలికారు.
 

తాజా వీడియోలు

Back to Top