చంద్ర‌బాబు చివ‌రికి చిడ‌త‌లు కొట్టే ప‌రిస్థితికి వ‌చ్చారు

మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌
 

అమ‌రావ‌తి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప‌రిస్థితి చివ‌ర‌కు చిడ‌త‌లు కొడుతూ..భిక్షం ఎత్తుకునే ప‌రిస్థితికి వచ్చింద‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఎద్దేవా చేశారు. టీడీపీ స‌భ్యులు బుధ‌వారం స‌భ‌లో చిడ‌త‌లు కొట్ట‌డాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మయాన్ని అడ్డుకోవ‌డం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు త‌గ‌ద‌న్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు డ్రంకెన్ టెస్ట్‌ చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు.  ఎన్నికల తరువాత టీడీపీ చిడతలు కొట్టుకోవాల్సిందేనని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.  సభకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు సమయాన్ని వృథా చేస్తున్నార‌ని, అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పీకర్‌ను కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top