అమరావతిని భ్రమరావతి చేసింది చంద్రబాబే

నాలుగు భవనాలు కట్టి.. రాజ‌ధాని పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం

అమరావతి రైతులను చంద్రబాబు నట్టేట ముంచాడు

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: అమరావతి రైతులను మోసం చేయబోమని మా ప్రభుత్వం మొదట్నుంచి చెబుతోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గతంలో అభివృద్ధి ఒక్క హైదరాబాద్‌కే పరిమితమైందని, రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌ను కోల్పోయి ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అలాంటి పరిస్థితి తలెత్తకూడదని అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. 

రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, అమరావతిని అభివృద్ధి చేయకుండా ఐదేళ్లు కాలయాపన చేశాడని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు సహకరించేలా గత ప్రభుత్వం సీఆర్‌డీఏని రూపొందించిందని, అమరావతిలో నాలుగు భవనాలు కట్టి రాజధానిగా చంద్రబాబు ప్రచారం చేశాడని దుయ్యబట్టారు. గత టీడీపీ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాఫియాతో కుమ్మకై దోచుకుందని, అమరావతి రైతులను చంద్రబాబు నట్టేట ముంచాడని, అమరావతిని భ్రమరావతి చేసింది చంద్రబాబేనని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top