ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
చంద్రబాబు ఛాలెంజ్ హాస్యాస్పదం
20 Oct 2021 2:36 PM
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: చంద్రబాబు ఛాలెంజ్ హాస్యాస్పదమని.. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టాభి వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన మంచి మనసు సీఎం వైయస్ జగన్‌ది. చంద్రబాబును సొంత పార్టీ నేతలే నమ్మడంలేదు. టీడీపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.
గుంటూరు: టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎల్లో మీడియా ఉంది కదా అని అడ్డదిట్టంగా మాట్లాడొద్దన్నారు. సంక్షేమ పాలన ఓర్వలేకే టీడీపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. టీడీపీ పథకం ప్రకారమే అలజడి సృష్టించాలని చూస్తోందన్నారు. పట్టాభి ఒక పెయిడ్ ఆర్టిస్ట్. పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరన్నారు. పట్టాభిని చట్టపరంగా శిక్షించాల్సిందేని మోపిదేవి డిమాండ్ చేశారు.
సంక్షోభం సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్
అనంతపురం: రాష్ట్రంలో సంక్షోభం సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. పట్టాభిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు.