కేశినేని నాని.. పెద్ద గజదొంగ

అలజడులు సృష్టించేందుకే చంద్రబాబు కుప్పం పర్యటన

త్వరలోనే రైల్వే ఇరిగేషన్‌ స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తాం

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: రైల్వే ఇరిగేషన్‌ స్థలాలను త్వరలోనే రెగ్యులరైజ్‌ చేస్తామని, స్థలాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోచుకో.. దాచుకో అన్న విధంగా టీడీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. విజ‌య‌వాడ‌లో మంత్రి వెల్లంప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల జీతాలను కేశినేని నాని ఎగ్గొట్టారని, ఇప్పుడు తన కూతుర్ని మేయర్‌ చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. కేశినేని నాని.. ఓ పెద్ద గజదొంగ అన్నారు. కుప్పంలో అలజడులు సృష్టించేందుకే చంద్రబాబు అక్కడకు వెళ్తున్నారని, ప్రజలు ఛీ కొట్టినా సిగ్గురాలేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. 

అవినీతి రహిత పాలనే ధ్యేయం
అవినీతి ఎక్కడ జరిగినా సహించేది లేదని, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఏసీబీ దాడులు చేస్తుందన్నారు. అవినీతి రహిత పాలనే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయమన్నారు. ఏసీబీ సోదాలను కూడా రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వంపై ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం వైయస్‌ జగన్‌ ప్రభంజనాన్ని ఆపలేరన్నారు. నీచ, కుట్ర రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టలేరన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top