ఆలయాలు కూల్చిన వారికి హిందువుల మీద ప్రేమ ఉన్నట్లా?

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్  

 ఆలయాలపై దాడులు జరగాలని కోరుకుంటున్న ఆ రెండు పార్టీలే డీజీపీపై దాడి చేస్తున్నాయ్‌
 
 విజయవాడలో40 దేవాలయాలను కూల్చినప్పుడు సోము వీర్రాజు ఎక్కడున్నారు?

  టీడీపీ- బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆలయాలు కూలిస్తే.. వైయ‌స్ జగన్ వాటిని పునర్నిర్మిస్తున్నారు

 మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే.. కేసులు పెట్టడం తప్పంటారా..?

  సంక్షేమ పథకాల అమలులో పార్టీలే చూడట్లేదు.. ఇక కులాలు, మతాలు చూస్తామా..? 

  పాస్టర్లకు, ఇమామ్‌లకు మాత్రమే కాదు.. అర్చకులకు కూడా గౌరవ వేతనాన్ని ఇస్తున్నాం
 

తాడేప‌ల్లి: ఆల‌యాలు కూల్చిన వారికి హిందువుల మీద ప్రేమ ఉన్న‌ట్లా అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరగాలని బలంగా కోరుకుంటున్న రెండు పార్టీలే ఇప్పుడు డీజీపీ మీద కూడా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు.  రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ-బీజేపీ కార్యకర్తలు ఉన్నారని ఆధారాలతో సహా డీజీపీ గౌతం సవాంగ్‌ వివరిస్తే,  ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుబట్టారు. డీజీపీ నిజాలు బయటపెట్టినప్పటి నుంచి చంద్రబాబు, టీడీపీ, బీజేపీ నాయకుల్లో వణుకుపుడుతోందని వెల్లంపల్లి అన్నారు. మత విద్వేషాలు పెంచేలా తమ కార్యకర్తలు ప్రవర్తించారా.. లేదా.. అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే.. కేసులు పెడతారా.. అని సిగ్గు లేకుండా అడుగుతున్నారని మంత్రి మండిపడ్డారు.  చట్టపరంగా చర్యలు తీసుకుంటే వ్యతిరేకిస్తున్న వీరంతా భారత రాజ్యాంగాన్ని, చట్టాలను గుర్తిస్తున్నారో.. లేదో.. చెప్పాలని నిలదీశారు. డీజీపీని రాజీనామా చేయమంటున్న సోము వీర్రాజు, చట్టాన్ని పనిచేయించినందుకు ఆయన రాజీనామా చేయాలా.. ? లేక తమ చట్టవిరుద్ధమైన పనులకు వత్తాసు పలకడం లేదు కాబట్టి రాజీనామా చేయాలో కూడా చెప్పాలి అని ప్రశ్నించారు.  రాముడి విగ్రహం తల తెగిందని అడగటం తప్పు కాదు కానీ, రాముడి తల విరిగిందని పండగ చేసుకోవడం, రాజకీయంగా అక్కడ నుంచే రెండు అంగుళాలు పైకి లేవాలని కుటిల యత్నం చేయటం మాత్రం కచ్చితంగా నేరమే అవుతుందని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. 

ఎవ్వరికీ భయపడం..
 కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా సంక్షేమ పథకాలకు ఇబ్బందిలేకుండా సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి   ప్రజలకు మేలు చేకూరుస్తున్నారు. ఇలా పథకాలు ప్రారంభించే సమయంలో కొద్ది రోజుల ముందు కానీ, కొద్ది రోజుల తర్వాత కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని ఆధారాలతో సహా డీజీపీ చెప్పటం జరిగిందని వెల్లంపల్లి తెలిపారు. దీనిమీద పోలీసులు కూడా సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇటీవలకాలంలో జరిగిన వరుస సంఘటనలు, తదనంతర పరిణామాలు, పాత సంఘటనలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఈ ప్రభుత్వం చేస్తోందనే తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంపై మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. దీనిపై బాధ్యత కలిగిన పార్టీలైతే ఇది మా పార్టీకి సంబంధం లేదనో, ఆ వ్యక్తులకు పార్టీకి సంబంధం లేదనో చెప్పాలి తప్ప, తప్పు చేసిన వారి బండారాన్ని బయట పెట్టిన డీజీపీ ని టార్గెట్ చేసుకొని విమర్శలు చేయటం ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు. డీజీపీని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు, సోమువీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ మాధవ్ అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డీజీపీకి లేఖ రాసి,  విత్‌డ్రా కాకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారిని (డీజీపీ) బెదిరించటం ఏంటి? మీరు డీజీపీని బెదిరిస్తున్నారా? లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించాలని భావిస్తున్నారా? ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి బెదిరిస్తూ లేఖ రాయటం చాలా బాధాకరమని వెల్లంపల్లి అన్నారు. సోమువీర్రాజు, మాధవ్‌ బెదిరిస్తే భయపడటానికి ఇది టీడీపీ ప్రభుత్వం కాదు.. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం... ఎవ్వరికీ భయపడే ప్రభుత్వం కాదని వెల్లంపల్లి స్పష్టం చేశారు.

 మీరు (బీజేపీ) ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాం అంటే చేసుకోండి. పోలీసులు తప్పు చేస్తే, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే చూపెట్టండి. ఏదైతే డీజీపీ ప్రకటన చేశారో అవన్నీ సాక్ష్యాధారాలతో సహా ఇచ్చారు. అంతే తప్ప రాజకీయంగా లబ్ది పొందాలని మీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఉసిగొప్పి సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేసి, సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలు రెచ్చగొడితే వారు ఎంతటివారైనా చర్యలు తప్పకుండా తీసుకుంటాం.. దేనికీ భయపడే పరిస్థితి కాదు.

హిందుత్వంపై చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించటమే
  దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్‌లో మాట్లాడుతున్నారు. హిందూమతం, హిందూ ధర్మం, హిందువుల మనోభావాల గురించి మాట్లాడే నైతిక అర్హతత చంద్రబాబుకు, టీడీపీకి లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకపక్షం.. అధికారంలో లేనప్పుడు మరోపక్షం. చంద్రబాబుకు దేవుడు అంటే భయం ఉంటే బూట్లు వేసుకొని పూజలు చేస్తారా? దేవాలయాల్లో క్షుద్రపూజలు చేస్తారా? తాంత్రిక పూజలు చేస్తారా? చంద్రబాబుకు దేవుడంటే భయమూ లేదు.. భక్తి లేదు. ఇటువంటి వ్యక్తుల్ని తప్పకుండా దేవుడు శిక్షించాడు. దాన్ని చంద్రబాబు ఇప్పటికే అనుభవిస్తున్నాడని, ఇంకా అనుభవించబోతాడని వెల్లంపల్లి అన్నారు.

 ఏ రాజకీయ పార్టీ అయినా బలం పెంచుకోవాలని అనుకుంటుంది. దాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. బీజేపీ ఎప్పుడైతే పవన్‌ కళ్యాణ్‌ను కలుపుకున్నారో హిందూమతాన్ని పూర్తిగా మంటకలిపేశారు. హిందువుల్ని బాధ పెట్టేవిధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అనేక మాటలు మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌తో ఈరోజు బీజేపీ ప్రయాణిస్తుంది. అలాంటిది హిందువులకు మేమే (బీజేపీ-జనసేన) పేటెంట్ అనుకుంటే రాష్ట్ర ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని వెల్లంపల్లి అన్నారు.

టీడీపీ-బీజేపీ ప్రభుత్వం 40 ఆలయాలను కూలగొట్టడం ఏ మత సంప్రదాయాలకు అనుకూలమో?
 40 గుళ్లను దుర్మార్గంగా మీ (టీడీపీ,బీజేపీ) ప్రభుత్వం, బీజేపీ మంత్రులుగా కొనసాగిన ప్రభుత్వం కూల్చివేస్తే ఆరోజున సోమువీర్రాజు ఏమైపోయారు, ఎక్కడ దాక్కున్నారు..? ఆరోజున బీజేపీ పార్టీలో ఆయన లేరా? ఇప్పుడు మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్‌ ఏమైపోయారు, మీరు బీజేపీలో లేరా? కనీసం ఆరోజు నోరు తెరిచారా? వారి ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెంలో రథం దగ్ధమైపోతే బీజేపీ నేతలు మాట్లాడలేదు, నైతిక బాధ్యత తీసుకోరు. కానీ, ఈ రోజు మాత్రం డీజీపీ రాజీనామా చేయాలంటారా? ఉన్న నిజాలు బయటపెట్టినందుకు డీజీపీ రాజీనామా చేయాలా? మీవైపు మాట్లాడనందుకా? నిజాలు బయటకు చెబుతుంటే.. మీరు బాధపడుతున్నారా? 
 
సోమువీర్రాజు గారు మీరు మానవత్వంతో ఆలోచించండి. రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. మత విద్వేషాలు తెచ్చే రాజకీయాలు ఎవ్వరికీ నచ్చవండీ. చేతనైతే ప్రజలకు మంచి చేయండి, ప్రజల్లో చిచ్చు మాత్రం పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా తప్పే. స్వార్థ రాజకీయాల కోసం, రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. 

అంతర్వేదిపై సీబీఐ దర్యాప్తునకు జీఓ ఇచ్చాం.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించటం లేదు?
 సోమువీర్రాజును సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇన్నిరోజులైనా అంతర్వేది రథం దగ్థంపై ఎందుకు కేసులు కట్టలేదని సోమువీర్రాజు కంగారు పడుతున్నారు. అయితే అంతర్వేది ఘటనపై 11.09.20న సీబీఐ దర్యాప్తు చేయమని మా ప్రభుత్వం జీఓ ఇచ్చిందని వెల్లంపల్లి జీఓను చూపించారు. మరి, నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ వేయలేదు? రికార్డులు కూడా సీబీఐకి అప్పజెప్పాము. కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీరు సీబీఐకి అప్పజెప్పమంటే.. అప్పజెప్పాము. సుమారు నాలుగు నెలలు పూర్తైపోతోంది. మీరు సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదు, రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయటం లేదు, మరి మీరు దోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారని వెల్లంపల్లి ప్రశ్నించారు. మీరు మాట్లాడితే నీతి.. అదే ప్రభుత్వ అధికారి (డీజీపీ) చెబితే వారు రాజీనామా చేయాలి, ఇదేనా మీ ద్వంద్వ వైఖరి, ఇదేనా మీ రాజకీయ నీతి అని సోమువీర్రాజును వెల్లంపల్లి ప్రశ్నించారు. 
 

 రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్ని విమర్శలు చేస్తున్న సోమువీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, తదితర బీజేపీ నేతలు ఎందుకు అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని అడగటం లేదని వెల్లంపల్లి నిలదీశారు. ఇదేనా మీకు హిందూమతం, హిందూ ధర్మం మీద ఉన్న విశ్వాసం అని ప్రశ్నించారు. 

పాస్టర్లకు, ఇమామ్‌లకు మాత్రమే కాదు.. అర్చకులకు కూడా గౌరవ వేతనాన్ని ఇస్తున్నాం
  ఇమామ్ లు, పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నారని మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఏంటని వెల్లంపల్లి అన్నారు. ఇమామ్ లు, పాస్టర్లు, అర్చకులకు కూడా సమానంగా ప్రభుత్వం గౌరవ వేతనాలు ఇస్తోందని వెల్లంపల్లి తెలిపారు. అర్చకులకు జీతాలు పెంచాలని మేనిఫెస్టోలో శ్రీ జగన్ గారు పెట్టారు. కొద్దిరోజుల్లో అది కూడా కార్యరూపం దాల్చబోతోందని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అదంతా పక్కన పెట్టి కేవలం పాస్టర్లకు, ఇమాంలకు డబ్బులు ఇస్తోందని అంటారు తప్ప అర్చకులకు డబ్బులు ఇస్తున్న సంగతి మాత్రం చెప్పరని వెల్లంపల్లి మండిపడ్డారు.  

  దేవాలయాలపై జరుగుతున్న దాడులపై.. 16 మంది సీనియర్ అధికారులతో సిట్ వేసి దర్యాప్తు చేస్తుంటే.. ఈ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవటం లేదని అంటారు. ఇవేమీ ప్రతిపక్షాలకు కనపడటం లేదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కనపడటం లేదా? మత రాజకీయాలు చేస్తారా? చంద్రబాబు, సోమువీర్రాజు, పవన్‌ కళ్యాణ్‌, మాధవ్‌ లాంటివారికి మత విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు.టీడీపీ హయాంలో 5 ఏళ్ళలో ఆలయాలపై రూ.150 కోట్లు ఖర్చు చేస్తే.. 20 నెలల్లో మేం రూ. 168 కోట్లు ఖర్చు చేశాం

 మీరు ఆలయాలు కూలిస్తే.. మేం ఆలయాలను పునర్నిర్మిస్తున్నాం ..

 టీడీపీ- బీజేపీ ప్రభుత్వంలో బీజేపీకి చెందిన వ్యక్తి దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నా 2014-19 మధ్య దేవాలయాల అభివృద్ధికి కేవలం రూ.150 కోట్లు కేటాయించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో రూ.168 కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిధులు రూ.70 కోట్లు కనకదుర్గమ్మ దేవాలయానికి కేటాయింపులు జరిగాయన్నారు. 

మీరు కూల్చేసిన గుళ్లను కట్టిస్తున్న చరిత్ర శ్రీ జగన్ ప్రభుత్వానిది. మీరు దేవాలయాలు కూలిస్తే.. మేం కడుతున్నామని వెల్లంపల్లి తెలిపారు. ఐదేళ్లు దిక్కుమాలిన పాలన చేసిన చంద్రబాబుతో బీజేపీ వారు అంటకాగారు. చంద్రబాబు, బీజేపీ కలిసి పాపాలు చేశారు. ఈరోజు శ్రీ జగన్  గొప్ప సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వంపై కుట్రలు చేయడానికి, కులరాజకీయాలు, మత రాజకీయాలు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏమాత్రమైనా సిగ్గు ఉందా అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంత మంచి ముఖ్యమంత్రి, చక్కటి పరిపాలన చేస్తుంటే ఏనాడైనా మెచ్చుకున్నారా అని ప్రతిపక్షాలపై వెల్లంపల్లి మండిపడ్డారు. ఈరోజున 31 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తుంటే మెచ్చుకోకపోగా, బండలు వేస్తారా అని నిలదీశారు. -దేవాలయాలపై దాడులకు సంబంధించి టీడీపీ, బీజేపీల ప్రేమేయం ఉందని, ఆధారాలతో సహా డీజీపీ గారు ఏదైతే చెప్పారో దానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని వెల్లంపల్లి తెలిపారు. 9 దేవాలయాలపై దాడులు చేసి ఆధారాలతో దొరికిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో కొంతమంది చంద్రబాబులా పారిపోయారు. త్వరలో అందరి జాతకాలు బయటకు వస్తాయని చెప్పారు. 

గుడికో గోమాత కార్యక్రమం...
  గుడికో గోమాత అని చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. గోవుల్ని పెంచుతాం, గోవుల్లో సకలదేవతలు ఉంటారని నమ్మే ప్రభుత్వం మాదని, కాబట్టే గుడికో గోమాత కార్యక్రమాన్ని పెట్టామన్నారు. కనుమ పండుగనాడు సుమారు 2500 దేవాలయాల్లో గోమాతకు పూజ చేసే కార్యక్రమాన్ని సీఎం శ్రీ జగన్ శ్రీకారం చుట్టారని వెల్లంపల్లి తెలిపారు. అదీ మా చిత్తశుద్ధి. మీలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు మరోలా వ్యవహరించమని వెల్లంపల్లి స్పష్టం చేశారు. 

నిజాలు తెల్సుకొని మాట్లాడండి సోమువీర్రాజు..
  దయచేసి సోమువీర్రాజు గారు ప్రెస్‌మీట్ పెట్టేటప్పుడు విషయాలు తెల్సుకొని, నిజాలు మాట్లాడండి. చంద్రబాబుకు నిజాలు చెబితే శిరస్సు వెయ్యి ముక్కలు అవుతుందనే  బుషి శాపం ఉన్నట్లుంది, అదే ట్రాప్‌లో పడి సోమువీర్రాజు కూడా నిద్రలేచినప్పటి నుంచి శ్రీ జగన్ గారు, ఈ ప్రభుత్వానికి మతాలు అంటకట్టడం ఏంటి? ఎన్నిరోజులు మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారని వెల్లంపల్లి ప్రశ్నించారు. 

బైబిల్‌కు, భగవద్గీతకు పోటీనా? ఎవరండీ చెప్పింది. మీవారు కాదా? మీ బండి సంజయ్‌ కదా? ఈ రాష్ట్రం, ఈ దేశంలో ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు అన్ని కులాలు, అన్ని మతాలను ఆదరించాలి. అంతేతప్ప ఒక మతాన్ని కించపరిచేలా, ఒక మతాన్ని రెచ్చగొట్టేలా, ఒక మతాన్ని ఇంకోలా చూడాలని ప్రయత్నం చేయటం ఏ పార్టీకి మంచిపద్ధతి కాదని వెల్లంపల్లి అన్నారు. 

 సీఎం వైయ‌స్ జగన్ గారి మతం మానవత్వం. అన్ని మతాలను సమానంగా చూస్తారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారు. అన్ని కులాలను గౌరవిస్తారు. సంక్షేమ పథకాల్లోనూ ఏ రాజకీయ పార్టీ చూడకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్లకు కూడా పథకాలు ఇస్తున్న ప్రభుత్వం ఇదని వెల్లంపల్లి అన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం మీద మతం బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయపార్టీలే చూడని వాళ్లం.. మతాలు, కులాలు చూస్తామా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. దయచేసి సోమువీర్రాజు విజ్ఞతతో మాట్లాడాలని వెల్లంపల్లి కోరారు. 

 ఈ ప్రభుత్వం హిందూమతాన్ని, హిందువుల మనోభావాలు, సంప్రదాయాలు గౌరవిస్తుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తాం. అన్ని మతాలను సమానంగా చూస్తాం. రాజకీయాల కోసం మతాలను విడదీయాలని, కులాల్ని విడదీయాలని మతాల మధ్య విద్వేషాలు పెట్టాలని ఈ ప్రభుత్వం చూడదన్నారు. ఇప్పటికైనా సోమువీర్రాజు మాట్లాడేటప్పుడు అధికారుల్ని బెదిరించటం కానీ, ప్రభుత్వాన్ని బెదిరించాలని అనుకుంటే బెదిరే వ్యక్తులం కాదని మీడియా ద్వారా తెలియజేస్తున్నానని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

Back to Top