‘జమిలి’ వస్తే టీడీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం

కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్‌ కూడా రాదు

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

తాడేపల్లి: టీడీపీ నేతలను కాపాడుకునేందుకు జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, జమిలి ఎన్నికలు వస్తాయని పగటి కలలు కంటున్నాడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జమిలి ఎన్నికలని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. జమిలి ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా.. టీడీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న 23 సీట్లలో ఒక్కటి కూడా రాదన్నారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్‌ కూడా రాదన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top