అచ్చెన్నకు పట్టినగతే బోండా ఉమాకు పడుతుంది

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం నిర్లక్ష్యానికి గురైందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ప్రజల సొమ్మును తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా దోపిడీ చేశారని మండిపడ్డారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. బోండా ఉమా, ఆయన కుటుంబం అరాచకాలు తొందరలోనే బయటపడతాయన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన అచ్చెన్నాయుడికి పట్టిన గతే బోండా ఉమాకు పడుతుందని హెచ్చరించారు. దోపిడీ చేసినవారు ఎవరూ తప్పించుకోలేరని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నాడని, హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top