ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

విజయవాడ నగర అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: విజయవాడ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని విజయవాడకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదన్నారు. చంద్రబాబు అండ్‌ కో అమరావతి పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేశినేని నాని, దేవినేని ఉమా, బోండా ఉమా, జలీల్‌ఖాన్‌ విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏడాదిలోనే దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులు పూర్తి చేశారని మంత్రి వెల్లంపల్లి వివరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top