టీడీపీ నేతలు అసత్య ప్ర‌చారం మానుకోవాలి

మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

విజయవాడ :  రాజ‌ధాని విష‌యంలో టీడీపీ నేత‌లు అస‌త్య ప్ర‌చారం మానుకోవాల‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ సూచించారు. గురువారం విజ‌య‌వాడ న‌గ‌రంలోని  43వ డివిజన్‌లో కోటి పది లక్షల రూపాయలతో పంపింగ్‌ వాటర్‌ సర్వీస్‌లైన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని  అన్నారు. సీఎం  వైయ‌స్ జగన్‌ రాష్ట్రాన్ని​ అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని జూమ్‌ యాప్‌ ద్వారా నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాదరణ లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రజలకు అందే సంక్షేమ ఫలాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి విషయంలో రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అని కేంద్ర ఇప్పటికే రెండు సార్లు ప్రకటించినా.. టీడీపీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో కోవిడ్‌ టెస్టుల్లో ఏపీ మొదటి  స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లంపల్లి అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top