మాస్క్‌ ఉంటేనే ఆలయాల్లోకి అనుమతి

భక్తులంతా ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు కేంద్ర అనుమతులు ఇచ్చిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేసిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈనెల 8, 9 తేదీల్లో అన్ని ఆలయాల్లో ఉద్యోగులతో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని, 10 నుంచి నిబంధనల ప్రకారం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. మాస్క్‌ ఉన్నవారినే ఆలయాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో శఠగోపం, తీర్థప్రసాదాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న ఆలయాల్లోకి భక్తులను అనుమతించమన్నారు. భక్తులంతా కచ్చితంగా ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఆలయాల్లోకి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్, శానిటైజర్‌ తప్పకుండా వాడాలని విజ్ఞప్తి చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top