మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

తాడేపల్లి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న అందరినీ సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకున్నారని, అదే విధంగా అర్చకులు, పురోహితులు, ఇమామ్‌లు, మౌజన్‌లు, పాస్టర్లకు ఆర్థికసాయం అందజేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 వేల పైచిలుకు అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదు.. ఏ ఒక్క కుటుంబం బాధపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అందరికీ తోడుగా నిలుస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు సాయం చేయాలని మనసున్న ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ఇంతటి చక్కటి సాయం చేశారన్నారు. కష్టకాలంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్‌లకు ఆర్థికసాయం అందజేసిన సీఎంకు మంత్రి వెల్లంపల్లి కృతజ్ఞతలు తెలిపారు. 
 

Back to Top