ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పన్నాగం పన్నుతున్నారనే సందేహం అందరిలో వ్యక్తం అవుతుందన్నారు. లేఖపై ఎన్నికల కమిషనర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మౌనం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top