దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి

రథానికి నిప్పుపెట్టిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి సీరియస్‌
 

విజయవాడ: నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో దుండగులు ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనపై దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులెవరో తక్షణం గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు. రథానికి నిప్పు పెట్టిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆకతాయిలు, దుండగులు చేస్తున్న ఇటువంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల పరిరక్షణకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

Back to Top