కార్మికుల సంక్షేమం కోసమే ఆర్టీసీ విలీనం

పవన్‌ గబ్బర్‌ సింగ్‌ కాదు..రబ్బర్‌ సింగ్‌ 

ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: కార్మికుల సంక్షేమం కోసమే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇచ్చిన మాటను సీఎం వైయస్‌ జగన్‌ నిలుపుకున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఏనాడూ చంద్రబాబు కార్మికులను పట్టించుకోలేదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మంచి నిర్ణయాలను పవన్‌ స్వాగతించలేకపోతున్నారని మండిపడ్డారు. పవన్‌ గబ్బర్‌ సింగ్‌ కాదు..రబ్బర్‌ సింగ్‌ అని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదని అన్నారు. రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Back to Top