పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
 

విజయవాడ: పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యమని, కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరకు రాజకీయాలను కూడా లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఏపీ దేవాదాయ శాఖ 2020 క్యాలెండర్‌ను మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ శాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. దేవాలయాల భూములను కాపాడుతున్నామని వివరించారు.  అన్యమత ప్రచారమంటూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 

Back to Top