అమరావతి గుర్తించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: ఐదేళ్లు అమరావతి పేరు చెప్పి చంద్రబాబు చేసింది భ్రమరావతే అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు ప్రజలు అవకాశం ఇస్తే ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టకుండా చంద్రబాబు కాలయాపన చేశారన్నారు. వేల కోట్ల రూపాయల ఈ-టెండర్లు పిలిచి ఇప్పుడు లొల్లి చేస్తున్నారన్నారు. రైతుల ముసుగులో టీడీపీ అరాచకం చేయాలని చూస్తోందన్నారు. రైతులను మోసం చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ చూస్తున్నాయన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేక ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి అన్నారు. సీఎం జగన్‌ అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నారన్నారని, దూరదృష్టితో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చూస్తున్నారన్నారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ కర్నూలు రాజధాని కావాలన్న మాట అవాస్తవమా అని ప్రశ్నించారు. అమరావతి వాస్తవరూపం సీఎం వైయస్‌ జగన్‌ ఆచరణలో చేసి చూపిస్తారన్నారు. నిపుణుల కమిటీ నివేదికపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top