‘దసరా’ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది

ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
 

విజయవాడ: దసరా పండుగ ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గ గుడి ఈఓ సురేష్‌బాబు, జేసీ మాధవీలతతో కలిసి దసరా పండుగ ఏర్పాట్లను సోమవారం మంత్రి వెల్లంపల్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలా కాకుండా దసరా ఉత్సవాలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దసరా ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. కేశఖండనశాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దసరా ఉత్సవాలకు ఫ్లై ఓవర్‌ పనులు ఆటంకం కలుగుతాయనే ఉద్దేశంతో పరికరాలను తొలగించాలని ఆదేశించినట్లు చెప్పారు.

Back to Top