ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ప్రతిపక్షం కుట్ర  

తిరుమల బస్‌ టికెట్ల వ్యవహారంపై విచారణకు ఆదేశం

వెల్లంపల్లి శ్రీనివాస్‌  

విజయవాడ: ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.  తిరుమల బస్‌ టికెట్ల అన్యమత ప్రచారం ప్రభుత్వ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామని తెలిపారు. ఆ టికెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్లు తేలిందన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు తిరుపతి డిపోకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారన్నారు. ఈ వ్యవహారంపై విచారణే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనేదే ప్రతిపక్షం కుట్ర అన్నారు. విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

Back to Top