పుష్కర ఘాట్‌ మ‌ర‌ణాల‌పై విచారణ  

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌  
 

అమరావతి:  కేబినెట్‌ సబ్‌ కమిటీ ద్వారా పుష్కర ఘాట్‌ మ‌ర‌ణాల‌పై విచారణ చేయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.  చంద్రబాబు వెళ్లిన పుష్కర ఘాట్‌ వద్ద కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని విమర్శించారు. పుష్కరాల్లో మృతుల కుటుంబాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని తెలిపారు.  సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌లోకి చంద్రబాబు వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో ఉందన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top