సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మహిళా పక్షపాతి  

వైయ‌స్ఆర్ ఆస‌రా వారోత్స‌వాల్లో మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌
 

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌హిళా ప‌క్ష‌పాతి అని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ కొనియాడారు. సోమ‌వారం కంబదూరులో వైయ‌స్ఆర్‌ ఆసరా 3వ విడత వారోత్సవాలలో మంత్రి పాల్గొని ఆసరా చెక్కును పొదుపు సంఘాల మ‌హిళ‌ల‌కు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..  మహిళా పక్షపాతి మన సీఎం జగనన్న.
నిరంతరం మహిళా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలోని అక్కా చెల్లమ్మల ఆనందమే ధ్యేయంగా సీఎం జగనన్న పాలన అందిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికలలో కూడా మన మహిళలందరూ సీఎం జగనన్న వెంట వుంటూ మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందాం అని పిలుపునిచ్చారు.  అనంత‌రం మహిళలతో కలిసి కేక్ కట్ చేసి, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్రపటానికి పాల అభిషేకం చేశారు. 

Back to Top