మహిళా సాధికారతే లక్ష్యంగా పాలన 

 మంత్రి ఉషాశ్రీచరణ్ 

అనంత‌పురం: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పాలన అందిస్తున్నార‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. అలాంటి నాయ‌కుడిని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని మంత్రి పిలుపునిచ్చారు.  శుక్ర‌వారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల పరిధిలోని వెలిగమేకలపల్లి గ్రామంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, పెనుకొండ నియోజకవర్గం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త కే.వి.ఉషాశ్రీచరణ్  నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళల ఆర్ధికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళల సర్వతోన్నాభివృద్దికి కృషి చేస్తున్న మన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వాన్ని మ‌ళ్లీ ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి, వేయించి గెలిపించాలని మంత్రి కోరారు. 

Back to Top