సీఎం వైయ‌స్ జగన్‌ సారథ్యంలో మహిళా సాధికారతకు అడుగులు

మ‌హిళా సాధికార‌తపై చ‌ర్చ‌లో మంత్రి ఉషశ్రీచరణ్ 
 

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సారథ్యంలో మహిళా సాధికారతకు అడుగులు ప‌డుతున్నాయ‌ని మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ అన్నారు. సోమ‌వారం అసెంబ్లీలో మ‌హిళా సాధికార‌త‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి మాట్లాడారు. వైయ‌స్ఆర్ చేయూతలో మహిళలను సీఎం వైయ‌స్ జగన్‌ ఆదుకుంటున్నారు. యువత పేరుతో చంద్రబాబు దోచుకున్నార‌ని మండిప‌డ్డారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా చంద్రబాబు యువతను మోసం చేశార‌ని ఆరోపించారు. హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చేందుకు మిగతా డైయిరీలకు నష్టం కలిగించార‌న్నారు. స్కాముల సీఎంగా చంద్రబాబు గుర్తుండిపోతారని ధ్వ‌జ‌మెత్తారు . సీఎం వైయ‌స్ జగన్‌ సారథ్యంలో మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వాల కంటే పదిరెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామ‌న్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ కాకముందే.. మూడేళ్లు ముందుగానే రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కల్పించార‌ని పేర్కొన్నారు.

Back to Top