శ్రీశైలంలో చెబుతున్నా..మళ్ళీ వైయ‌స్ జగనే సీఎం

మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

నంద్యాల‌:  శ్రీశైలం మలన్న దేవస్థానంలో చెబుతున్నా…. ఈసారి మళ్ళీ వైయ‌స్ జగన్ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పరిపాలన అందిస్తార‌ని మంత్రి ఉషాశ్రీ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. బుధ‌వారం మంత్రి ఉషశ్రీ చరణ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్ నవరత్నాలు సంక్షేమ పథకాలు పేరుతో పాదయాత్ర చేశారన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యేలపై విమర్శలు తప్ప.. పథకాలు ఏమిస్తామని ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారన్నారు.
 

పవన్ స్టాండ్ లేని వ్యక్తి….  ఆయన స్టాండ్ ఏంటో ఆయనకే తెలియదని ఉషశ్రీ చరణ్ అన్నారు. పవన్ కు క్లారిటీ ఉంటే ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్ కింద జనసేన కార్యకర్తలు స్టిక్కర్ వేయడం రాజకీయ దురుద్దేశమన్నారు. జనసేన కార్యకర్తలు అసలు ఏం చేస్తారని, ఏం చేయబోతారు అనే స్టాండ్ ఉండి అప్పుడు ప్రతి ఇంటికి వెళ్తే అర్ధం ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. 

Back to Top