పేద ప్ర‌జ‌ల అభ్యున్న‌తే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ధ్యేయం

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

అనంత‌పురం: పేద ప్రజల అభ్యన్నతి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నార‌ని, అక్క‌చెల్లెమ్మ‌ల ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. క‌ల్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం కుందుర్పి మండల పరిధిలోని కళిగొలిమి, అప్పాజి పాళ్యం గ్రామాలలో చేప‌ట్టిన‌ "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రతి గడపకు తిరిగి ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించారు. అదే విధంగా స్థానికంగా నెల‌కొన్న సమస్యలను ప్ర‌జ‌లు అడిగి తెలుసుకొని, వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top