ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి ఆగదు 

చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ 

 చిత్తూరు:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతోందని, ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి ఆగద‌ని  మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్  అన్నారు. శ‌నివారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ‌ మందిరంలో జిల్లా అధికారుల‌తో అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రిగా వైయ‌స్‌ జ‌గ‌న్ స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కిచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌పోయినా.. సంక‌ల్ప‌బ‌లంతో ముందుకుసాగుతున్నారు. 35 నెల‌ల వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంద‌న్నారు. ఒక వైపు క‌రోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు.. ప్ర‌తిప‌క్షాల కుట్ర‌లు, కుతంత్రాల‌తో యుద్ధం చేస్తూనే, మ‌రోవైపు సంక్షేమాన్ని క‌ళ్ల ముందు ఆవిష్క‌రిస్తున్నారు.  స‌మావేశంలో మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి  ఆర్కే రోజా , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top