జగనన్న మళ్లీ సీఎం కాబోతున్నారు

మంత్రి ఉషాశ్రీ చరణ్‌

తిరుప‌తి: దొంగ ఓట్లుపై చంద్రబాబు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉషాశ్రీ చరణ్ దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారు.. వాటితోనే ఆయన విజయం సాధించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. వ‌చ్చే 
ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో చంద్రబాబు ఫిర్యాదులు చేస్తున్నారని మంత్రి విమ‌ర్శించారు.  రాబోవు ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేది వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే.. జగనన్న మళ్లీ సీఎం కాబోతున్నారు అనే నమ్మకాన్ని మంత్రి ఉషాశ్రీ చరణ్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. 

Back to Top