ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

అమరావతి: కరోనా వైరస్‌ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  తానేటి వనిత సూచించారు.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ సూచనలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారని వివరించారు. ఈ ఒక్క రోజుతో అయిపోయిందని అనుకోవద్దు. రేపటి నుంచి కూడా ముందు జాగ్రత్తలు అందరూ పాటించాలి. ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం అండగా ఉందన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top