ఏ నోటా విన్నా జగనన్న మాటే

మంత్రి తానేటి వనిత
 

 
విజయవాడ: రాష్ట్రంలో ఎవరి నోటా విన్నా కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరే వినిపిస్తుందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మహిళా సాధికారతకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్ద పీట వేసి మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి వనిత ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే..

ఈ రోజు మన రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. రెండున్నరేళ్లుగా జగనన్న మనకు ప్రత్యేక పాలన అందించారు. మహిళా పక్షపాతిగా మనందరి సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం కోసం, మనందరం మహిళా సాధికారత సాధించాలని మనందరికి ఒక అన్నలా, తమ్ముడిగా అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజు మన సంబరాలు అంబరాన్ని అంటేలా వేడుకలు చేసుకుంటున్నాం. సామాజిక, వాణిజ్య రంగం, క్రీడారంగం, సామాన్య కుటుంబాన్ని నడిపిస్తున్న అమ్మలు, ఈ రోజు వేదిక మీద ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మేయర్లు, ఎంపీపీలు, చైర్‌పర్సన్‌లు సగర్వంగా కూర్చున్నారంటే అది వైయస్‌ జగన్‌ ఘనతే. ఎవరి మాట విన్నా జగనన్న అనే పదం వినిపిస్తోంది. అన్నా అంటే అమ్మలో సగం, నాన్నలో సగం, అన్నకు సరైన నిర్వచనం మన జగనన్న..మన బాధ్యతలను మేమమామలా వైయస్‌ జగన్‌ తీసుకున్నారు. సంపూర్ణ పోషకాహారాన్ని, జగనన్న గోరుముద్ద అందిస్తున్నారు. అందరం ఈ రోజు సంతోషించాల్సిన విషయం మహిళా సాధికారత అంటే అసలైన అర్థం..మన నిర్ణయాలు మనమే తీసుకునే స్థాయికి ఎదగడం. ఇందుకు విద్యా, వైద్యం, ఆరోగ్యం ఈ మూడు ఉండాలి. ఈ రోజు డ్రాక్వా అక్కాచెల్లెమ్మలు కొంత మంది చదువు లేని వారు ఉన్నారు. మధ్యలో చదువు ఆపేసిన వారు ఉన్నారు. అలాంటి మహిళలకు అండగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలను లక్షాధికారులను చేయాలన్న దివంగత సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి కన్న కలలను ఈ రోజు ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ నిజం చేస్తున్నారు.
ఆడబిడ్డలందరికీ కూడా భద్రతనిస్తూ దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. రక్తహీనతకు దూరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు పొదుపురుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. మనసున్న మారాజు మాకు కావాలని జగనన్నను ముఖ్యమంత్రిని చేసిన మహిళా మణులకు నా పాదాభివందనాలు
కేబినెట్‌లో ముగ్గురు మహిళలకుమంత్రి పదవులు ఇచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా, మరోకరిని హోం మంత్రిగా, తనను మహిళా సంక్షేమశాఖ మంత్రిగా చేశారు. మహిళా సాధికారత కేబినెట్‌ నుంచే ప్రారంభమైంది. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. మనందరి భవిష్యత్‌ కోసం ఇంతగా ఆలోచన చేసిన సీఎం ఎవరూ లేరు. రాబోయే రోజుల్లో కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని మన పిల్లలకు మంచి భవిష్యత్‌ ఇద్దామని మంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top