వైయస్‌ఆర్‌ చేయూతతో మహిళల ఆర్థికాభ్యున్నతి

మంత్రి తానేటి వనిత

అమ్మ  ఒడితో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది

రుణమాఫీ వల్ల స్వయం సహాయక సంఘాలకు ఊతం

ఇప్పటి వరకు 24.55 లక్షల మంది లబ్ధిదారులకు రూ.8,943.53 కోట్లు 

అమరావతి:  వైయస్‌ఆర్‌ చేయూత పథకంతో మహిళల ఆర్థికాభ్యున్నతి సాధ్యమవుతుందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తానేటి వనిత అసెంబ్లీలో వివరించారు. ఆమె మాటల్లోనే..

7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 78.76 లక్షల మంది సభ్యులకు రూ.25516.56 కోట్లు నిర్ణయించింది. ఈ చర్చ మహిళా సాధికారతను బలోపేతం చేస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద పొదుపు సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. ఈ పథకాన్ని 2020, సెప్టెంబర్‌ 20న సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. మొదటి విడతలో రూ.6618.76 కోట్లు, రెండో విడతలో రూ.6439.52 కోట్లు డ్వాక్రా సంఘాలకు ప్రయోజనం చేకూర్చాయి. ఇప్పటి వరకు  78.78 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగింది.రూ.12750 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. సమూహాల శాతం గత పాలనలో 18 శాతం ఉంటే..ప్రస్తుతం ఇది 1 కంటే తక్కువ తగ్గింది. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడం వల్లే స్వయం సహాయక సంఘాల పరిస్థితి దారుణంగా ఉండేది. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రుణాలు విడతల వారిగా మాఫీ చేయడంతో సంఘాలు కోలుకోగలుగుతున్నాయి. గతంలో సీ,డీ గ్రేడింగ్‌ గ్రూపులు ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయి. 
వైయస్‌ఆర్‌ చేయూత పథకం అన్నది ఒక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమం. సమాజిక, ఆర్థిక సాధికారత వైపు మళ్లించేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు రూ.75 వేలు అందజేస్తున్నాం. ఈ పథకాన్ని ఆగస్టు 12, 2020న ప్రారంభించారు. ఇప్పటి వరకు 24.55 లక్షల మంది లబ్ధిదారులకు రూ.8953.53 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం కింద మొదటి ఏడాది అమూల్, హిందుస్థాన్, ఐటీసీ, పీఆర్‌ అండ్‌ ఆర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకొని మహిళలను తమ కంపెనీల్లో భాగస్వాములనుగా చేసుకుంది. 
రిటైల్‌ వ్యాపారం, అమలు స్థితి..1.10 లక్షల మంది లబ్ధి పొందారు. రూ.438.75 కోట్లు రుణం అందజేశాం. పశుసంవర్థక స్థితి..ఆవులు, గేదెలు 1,34, 103 యూనిట్లు, వారికి ఆర్థిక మద్దతుగా రూ.757.80 కోట్లు. ఒక్కో కుటుంబానికి సగటున ఆదాయం రూ.8 వేలు ఉంది. గొ్రరెలు, మేకలు 82556 యూనిట్లు, ఆర్థిక మద్దతు రూ.458.82 కోట్లు అందించాం. సగటు ఆదాయం రూ.6 వేలుగా ఉంది. 
వైయస్‌ఆర్‌ కాపు నేస్తం:
ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు చొప్పున కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉప కులాల మహిళలకు రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించడం ద్వారా మహిళల జీవన ప్రమాణాలు పెంపొందించాం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కాపు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. 3,27,867 మందికి రూ.981.88 కోట్లు వెచ్చించాం. అగ్రకులాల్లో ఉన్న మహిళలకు కూడా మా ప్రభుత్వం మద్దతుగా నిలిచింది.

జగనన్న వసతి దీవెన:
అర్హులైన విద్యార్థులకు ఆహారం, ప్రయాణం, హాస్టల్‌ ఖర్చులకు సహాయం అందించేందుకు ఈ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదువుతున్న వారికి రూ.20 వేల చొప్పున  ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. కుటుంబంలో చదువుతున్న విద్యార్థులందరికీ వారి సంఖ్యతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. మొత్తం డబ్బులు నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 1556956 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.2269.93 కోట్లు జమ చేశాం.

జగనన్న విద్యా దీవెన పథకం:
దేశంలోనే మొదటి సారిగా ఈ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మన ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేస్తున్నాం. ఎలాంటి బకాయిలు లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నాం. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుపై బాధ్యత, పాఠశాల నిర్వాహణపై బాధ్యత పెరుగుతోంది. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహానేత మరణాంతరం ఈ పథకానికి తూట్లు పొడిచారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఈ పథకాన్ని పునరుద్ధరించారు. గత ప్రభుత్వం ఈ పథకం ద్వారా పెట్టిన రూ.1800 కోట్ల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రూ.5573. 12 కోట్లు చెల్లిస్తున్నాం.  18,80934 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు.

వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక
ఈ పథకం ద్వారా 61.73 లక్షల మందిలో 36.7 లక్షల మంది మహిళా లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్యాప్య పింఛన్‌ కింద  21899 మంది ఉన్నారు. చేనేత కార్మికులు, వికలాంగులు, వితంతువులు, డప్పు కళాకారులు, సైనిక సంక్షేమ పింఛన్లు, రోగులకు ఆరోగ్య పింఛన్లు చెల్లిస్తున్నాం.

వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం:
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు తీసుకుంటున్న రుణాలు సకాలంలో చెల్లించేందుకు, వారిపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వైయస్‌ జగన్‌ ఏప్రిల్‌ 24, 2020న ప్రారంభించారు. ఇప్పటి వరకు 90 లక్షల పొదుపు సంఘాలకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.2354.22 కోట్లు విడుదల చేశాం.
బ్యాంకు లింకేజీ :
పేద కుటుంబాలు తక్కువ వడ్డీతో డ్వాక్రా సంఘాలు రుణాలు పొందేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం, రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రూ.20 వేల కోట్లు పంపిణీ చేశాం. 5.91 లక్షల గ్రూపులకు డబ్బులు పంపిణీ చేశాం.
ఇళ్ల స్థలాలు:
మహిళా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు మహిళల పేరుతో పంపిణీ చేశాం. కులం, మతంతో సంబంధం లేకుండా ఇళ్లు లేని పేదలందరూ ఈ పథకానికి అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇచ్చామని తెలిపారు. 
 

Back to Top